Corona Deaths In US: అమెరికాలో 9 లక్షలు దాటిన కరోనా మరణాలు.. నెంబర్ 1 ప్లేస్‌లో..

Corona Deaths In US: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Update: 2022-02-06 16:15 GMT

Corona Deaths In US: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓ వైపు లక్షల్లో వైరస్‌ కేసుల నమోదవ్వగా.. మరణాలు సంఖ్య కూడా రికార్దు స్థాయికి చేరుకుంది. తాజాగా మొత్తం మరణాల సంఖ్య ఏకంగా 9లక్షలు దాటింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ స్థాయిలో కొవిడ్‌ మరణాలు సంభవించలేదు. అమెరికా తర్వాత 6 లక్షల మరణాలతో బ్రెజిల్‌ రెండో స్థానంలో, భారత్‌ మూడో స్థానంలో ఉంది.

రెండేళ్ల క్రితం అమెరికాలో కరోనా ప్రవేశించిన నాటి నుంచి శుక్రవారం వరకు కరోనా మృతుల సంఖ్య 9లక్షలు దాటినట్లు ఓ జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ వెల్లడించింది. ఇటీవల ఒమిక్రాన్‌ వ్యాప్తితో మళ్లీ విజృంభించింది. రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఫలితంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే లక్ష మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొంది.

2020 ఫిబ్రవరిలో అమెరికాలో కరోనా తొలి మరణం నమోదైంది. అప్పుడు మొదలదైన మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. కరోనా భారత్‌లోనూ విలయతాండవం చేసింది. దేశవ్యాప్తంగా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో కోవిడ్ వేరియంట్లతో ఇప్పటి వరకు దేశంలో 5 లక్షల మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags:    

Similar News