Ayman al-Zawahiri: ఎవరీ అల్ జవహరీ..? కంటి డాక్టర్ నుండి అల్-ఖైదా లీడర్‌గా ఎలా మారాడు..?

Ayman al-Zawahiri: 2017లో అల్-ఖైదా సీనియర్ లీడర్ అబూ-అల్-ఖైర్ అల్-మస్రీని హతమార్చేందుకు ప్లాన్ చేసింది అమెరికా.

Update: 2022-08-02 15:30 GMT

Ayman al-Zawahiri: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఆల్ ఖైదా అగ్రనాయకుడు అల్-జవహరీని అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లోని ఆయన రహస్య నివాసంలో మట్టుబెట్టినట్టు అమెరికా ప్రకటించింది. దీనికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించేలా ప్లాన్‌ చేశాయి అమెరికన్‌ బలగాలు. ఎంతో చాకచక్యంగా జరిగిన జవహరీ డెత్‌ అపరేషన్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాబూల్ లోని ఓ రహస్య ప్రాంతంలో జవహరీ ఉన్నాడన్న విషయాన్ని కన్ఫామ్‌ చేసుకున్న వెంటనే పెంటగాన్ హెడ్‌క్వార్టర్‌ అలెర్ట్ అయింది. గంటల వ్యవధిలోనే ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఇంతలో జవహరీ ఇంటి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు.

క్షణాల వ్యవధిలో జవహరీని టార్గెట్‌ చేసి డ్రోన్ల సాయంతో రెండు హెల్ ఫైర్స్ ఆర్‌9ఎక్స్‌ మిసైళ్లతో ఎటాక్‌ చేసింది అమెరికా సైన్యం. లేజర్ కిరణాల తీవ్రతకు బాల్కనీ కిటికీ అద్దాలు పగిలిపోగా.. వెంటనే అందులో నుంచి వచ్చిన ఆరు బ్లేడ్లు జవహరీ ప్రాణాలను గాలిలో కలిపేశాయి. అయితే, ఈ దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఏమీ కాలేదు. ఎలాంటి పేలుడూ జరుగలేదు.సెకండ్లలో ఆపరేషన్ సక్సెస్ అయింది. అసలు ఏం జరుగుతుందో పక్కన ఉన్నవారికి తెలిసేలోపు ఆర్‌9ఎక్స్‌ తన పని తాను చేసుకుపోయింది.

2017లో అల్-ఖైదా సీనియర్ లీడర్ అబూ-అల్-ఖైర్ అల్-మస్రీని హతమార్చేందుకు కూడా ఇదే టెక్నాలజీని వినియోగించింది అమెరికా. 1951 జూన్‌ 19న ఈజిప్టు రాజధాని కైరో శివారు ప్రాంతంలో ఓ మధ్యతరగతి విద్యావంతుల కుటుంబంలో జవహరీ జన్మించాడు.అతడి కుటుంబంలో చాలా మంది వైద్యులు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. తండ్రి మహమ్మద్ అల్ జవహరీ స్థానిక కైరో యూనివర్శిటీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తండ్రి బాటలోనే జవహరీ కూడా ఇదే యూనివర్శిటీలో 1974లో మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు సర్జరీలో మాస్టర్స్‌ పూర్తి చేసి కొంతకాలం పాటు కంటి డాక్టర్‌గా పనిచేశారు.

అయితే జవహరీకి చిన్నతనం నుంచే మతచాంధస భావాలు ఎక్కువగా ఉండేవి. 15ఏళ్ల వయసులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ గ్రూప్‌లో సభ్యుడిగా చేరి అరెస్టయ్యాడు. ఇలా తీవ్రవాద భావజాలం ఉండటంతోనే.. వైద్యుడిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.ఇక 1985లో జైలు నుంచి విడుదలైన తర్వాత జవహరీ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు.అక్కడే లాడెన్‌తో అతడికి స్నేహం కుదిరింది. బిన్‌ లాడెన్‌ అల్‌ఖైదా పేరుతో టెర్రరిస్ట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన సమయంలో కూడా జవహరీ లాడెన్‌ పక్కనే ఉన్నట్లు కథనాలు వచ్చాయి. లాడెన్‌కు జవహరీ రైట్‌ హ్యాండ్‌ చెబుతారు.

గతంలో ఈజిప్టు ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జవహరీ ఆధ్వర్యంలో టెర్రరిస్ట్‌ గ్రూప్‌లు దేశవ్యాప్తంగా వరుస ఎటాక్‌లు జరిపాయి. ఈ ఎటాక్‌లలో దాదాపు 1200 మంది సామాన్య పౌరులు మరణించారు. అప్పటి నుంచి న్యూయార్క్ 9/11 ట్విన్‌ టవర్స్‌ ఎటాక్‌, లండన్, బాగ్దాద్ వరకు అనేక టెర్రర్‌ అటాక్‌ వరకు అనేక దాడులకు జవహారీ వ్యూహరచన చేశాడు.. పురిగొల్పాయి. మరోవైపు జవహరీని చంపడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. అమెరికా ఫోకస్‌ జవహరీ నుంచి తప్పించడానికి.. అనారోగ్య కారణాలతో జవహరీ చనిపోయినట్లు అల్‌ఖైదా ప్రచారం చేసింది. ఆ ప్రచారం నిజమేనని అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఫిక్సైంది.

కొన్ని రోజుల తరువాత అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌కే షాక్‌ ఇస్తూ జవహరీ ప్రసంగ వీడియో విడుదలైంది. జీహాదీ గ్రూపులపైనా, వారి వెబ్‌సైట్లపైనా 24 గంటలూ కన్నేసి ఉంచే నైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్‌.. జవహరీ వీడియో చూసి షాక్‌ అయింది. జవహరీ డెత్‌ అపరేషన్‌ చేసాకే ప్రపంచానికి చెప్పాలని కసిగా పనిచేసింది అమెరికా ఇంటెలిజెన్స్‌. అలా అన్నీ మార్గాల్లో జవహారీ కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చింది. నెల రోజుల క్రితం జవహరీ ఆచూకీని నిర్ధారించుకున్న CIA వర్గాలు… విషయాన్ని అధ్యక్షునికి చేరవేశాయి. వెంటనే వైట్‌ హౌజ్‌లోని స్పెషల్‌ రూమ్‌లో వ్యూహరచన మొదలైంది.

జవహరీ ఉంటున్న ఇంటి నమూనాను తయారు చేసి… పకడ్బందీ ప్లాన్‌ రూపొందించారు. ఉపయోగించే ఆయుధాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ.. హెల్ ఫైర్స్ ఆర్‌9ఎక్స్‌ మిసైళ్లను ఎంచుకుంది. టార్గెట్‌ను ఫర్ఫెక్ట్గ్‌గా చేజ్‌ చేసే ఈ మిసైల్‌ చిన్న తప్పుకూడా చేయదు. ఎలాంటి సడి చప్పుడు లేకుండా తన టార్గెట్ ను‌ క్షణాల్లో పూర్తిచేస్తుంది. అందుకే ఈ ఆపరేషన్‌కు అమెరికన్‌ బలగాలు హెల్ ఫైర్స్ ఆర్‌9ఎక్స్‌ను వాడారు. అయితే ఎక్కడా ఈ విషయాన్ని అమెరికా లీక్‌ చేయలేదు. తన అపరేషన్‌ పూర్తి అయిన తరువాత ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకొని ఒకరోజు తరువాత ప్రపంచానికి చెప్పింది.

Tags:    

Similar News