TET : టెట్‌కు 2,86,386 దరఖాస్తులు

Update: 2024-04-22 06:26 GMT

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు అభ్యర్థుల నుంచి 2,86,386 దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో (20వ తేదీ) టెట్‌ దరఖాస్తుల గడువు ముగిసింది. పేపర్‌–1కు 99,958 మంది, పేపర్‌–2కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌–2లో మ్యాథ్స్‌కు 99,974 మంది, సోషల్‌ స్టడీస్‌కు 86,454 మంది అప్లై చేశారు. మొదట టెట్‌కు దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉండగా.. తర్వాత 20వ తేదీ వరకు పొడిగించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. కాగా, దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వాటిని ఎడిట్‌ చేసుకోవడానికి ఇచ్చిన ఆప్షన్‌ గడువు కూడా ముగిసింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందు టెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 20 నుంచి జూన్‌ 3 వరకు ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీటీ)లో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News