JNTU Exams Postponed : జేఎన్టీయూ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా

Update: 2024-09-02 11:00 GMT

భారీ వానల నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలో సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ వెంకటేశ్వర రావు సర్కులర్ జారీ చేశారు. దీంతో సోమవారం జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ అన్నీ ఈ నెల 5న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ఎల్లుండి జరగాల్సిన పరీక్షలన్నీ యథాతధంగా జరుగుతాయని రిజిస్ట్రార్ తెలిపారు.

Tags:    

Similar News