AP Inter Supplementary Results : ఇవ్వాళ ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

Update: 2024-06-26 05:25 GMT

ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెల్లడి కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. కాగా ఈ నెల 18న ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక సైట్‌లో విడుదల చేస్తారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో పరీక్షల్ని నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సెకండియర్ పరీక్షల్ని మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు నిర్వహించారు.

ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 33 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. మరో 37 సున్నితమైన కేంద్రాలను కూడా ఇంటర్ బోర్డు గుర్తించింది.

Tags:    

Similar News