Osmania University : ఓయూలో పార్ట్‌టైం లెక్చరర్...పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Update: 2024-10-10 13:30 GMT

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలోని సైకాలజీ విభాగంలో పార్ట్‌టైం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా బయోడేటా, సంబంధిత పత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండడంతో పాటు నెట్‌, సెట్‌, స్లెట్‌లలో ఉత్తీర్ణత సాధించడం లేదా పీహెచ్‌డీ పట్టా పొంది ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులని చెప్పారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.

Tags:    

Similar News