Charge Sheet on Students : ఎగ్జామ్ పేపర్ ను షేర్ చేసిన స్టూడెంట్ పై చార్జిషీట్
యూజీసీ నెట్ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ఎగ్జామ్ పేపర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఓ స్టూడెంట్ పై చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఈ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. లీకైన ఆ ప్రశ్నపత్రం వక్రీకరించినదని, ఆ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్ లో వైరల్ కావడం వెనుక ఓ స్కూల్ స్టూడెంట్ ఉన్నాడని అధికారులు వెల్లడించారు. ఓ యాప్ ద్వారా ఆ స్టూడెంట్ ఈ పనిచేశాడన్నారు. దానిపై డేట్‌ను జూన్ 17గా మార్పు చేశారని తెలిపారు. తనవద్ద తర్వాత పరీక్ష ప్రశ్నపత్రం కూడా ఉందని నమ్మించి, కొంత డబ్బు సంపాదించేందుకే దానిని వైరల్ చేసినట్లు వెల్లడించారు. అది మార్పులు చేసిన పేపర్ అని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు చెప్పారు. ఆ స్టూడెంట్ పై చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.