TG DSC : తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

Update: 2024-06-14 04:48 GMT

డీఎస్సీ ( DSC ) రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కుల నిబంధన ఉండేది. కాగా భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది.

మరోవైపు టెట్‌లో అర్హత సాధించిన వారు డీఎస్సీకి చేసుకున్న దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెట్ మార్కులతో పాటు ఇతర వివరాలు ఎడిట్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిన్న టెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫెయిల్ అయిన వారు డిసెంబర్‌లో జరిగే టెట్‌కు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని వివరించింది.

Tags:    

Similar News