గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి TGPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈనెల 9న ఉ.10:30 నుంచి మ.ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ ఓటీఆర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల కిందట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి… మరికొన్ని పోస్టులను కలిపి ఈ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా…. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది.