Group-1 Preliminary Exam Key : గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల

Update: 2024-06-13 06:26 GMT

గ్రూప్-1 ప్రిలిమ్స్ కీని TGPSC విడుదల చేసింది. కీతో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని కూడా వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. జూన్ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. లాగిన్ అయ్యాక కీ పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు టెక్స్ట్ బాక్సులో తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫైనల్ కీని తయారు చేస్తారు. ఆ తర్వాత ఫైనల్‌ కీతోపాటు ఫలితాలను కూడా విడుదల చేసేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను TGPSC విడుదల చేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించగా, అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని తెలిపింది. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్ పైనున్న ఫొటోల్లో చూడవచ్చు.

కాగా మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్‌ 9వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో జరిగింది. అయితే వీరిలో 3.02 లక్షల మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్షమంది పరీక్షకు హాజరవలేదు.

Tags:    

Similar News