గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు TGPSC కఠిన నిబంధనలు రూపొందించింది. జూన్ 9న ఉ.10.30-మ.ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్‌నోట్ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫొటో బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వనివారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్‌ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ద్రువీకరించుకుంటామని పేర్కొన్నారు.
హాల్‌టికెట్‌ను A4 సైజ్ ప్రింట్ తీసుకోవాలి.
అందులో ఫొటో సరిగ్గా లేకుంటే గెజిటెడ్ అధికారి/చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను రెడీ చేసుకోవాలి.
కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
హాల్‌టికెట్‌పై అభ్యర్థి తాజా ఫొటోను అతికించాలి.
అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డులోని వివరాలను సరిపోల్చిన తర్వాతే పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు.
ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్‌టికెట్‌పై సంతకం చేయాలి.
ఫొటో, సంతకం విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే పరీక్షకు అనుమతివ్వరు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారు.
నగలు, ఆభరణాలు తీసుకెళ్లకూడదు.