దేశంలోని బ్యాంకుల్లో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమ్స్, అక్టోబర్ 13న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తైన 20 నుంచి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు రూ.175, ఇతరులు రూ.850 ఫీజు చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానం ద్వారా జులై 1, 2024 నుంచి జూలై 21 వరకు దరఖాస్తు చేతసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ప్రిలిమినరీ పరీక్ష తేదీలను 2024 ఆగస్టు 24, 25, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలను 2024 సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో ఈ ఖాళీలున్నాయి.