RRB Notification : గ్రామీణ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Update: 2024-06-08 06:59 GMT

వివిధ రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కింద పేర్కొన్న గ్రూప్‌–ఎ–ఆఫీసర్‌ (స్కేల్‌–1, 2, 3), గ్రూప్‌ బి–ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గ్రామీణ బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌, కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌, విదర్భ కొంకణ్‌ గ్రామీణ బ్యాంక్‌.

● ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌): 5,585, ఆఫీసర్‌ స్కేల్‌–1: 3499, ఆఫీసర్‌ స్కేల్‌–2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 70, ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 30, ఆఫీసర్‌ స్కేల్‌–2(సీఏ): 60, ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 94, ఆఫీసర్‌ స్కేల్‌–2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 496, ఆఫీసర్‌ స్కేల్‌–2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 11, ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 21, ఆఫీసర్‌ స్కేల్‌–3: 129

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్‌ రాత పరీక్ష, మెయిన్స్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు/విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, కరీంనగర్‌.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్‌ 27 వెబ్‌సైట్‌: www.ibps.in/

Tags:    

Similar News