తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ (Government Jobs) నియామకాల్లో భాగంగా కీలక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 547 ఉద్యోగాల భర్తీకి 6 జాబ్ నోటిఫికేషన్‌ల కింద నిర్వహించిన పరీక్షల రిజల్ట్స్ ను టీఎస్‌పీఎస్సీ అనౌన్స్ చేసింది.
టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీబీపీవో), డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్‌సీ ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాలను మెరిట్ ప్రకారం అందుబాటులో ఉంచింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన వారి లిస్ట్ ను ప్రకటిస్తామని తెలిపింది నియామక సంస్థ.
547 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇవ్వగా, 2023 మే, జూన్, జులై నెలల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల జనరల్ ర్యాంకు జాబితాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటించనున్నారు.