TS Group-1 Hall Tickets : జూన్ 1న గ్రూప్-1 హాల్ టికెట్లు

Update: 2024-05-24 05:07 GMT

జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈసారి భారీగా(4.03లక్షలు) దరఖాస్తులు రావడంతో OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉ.10:30 నుంచి మ.ఒంటి గంట వరకు పరీక్ష జరగనుండగా, అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్‌లో సమస్య ఉంటే అభ్యర్థి ఫొటో, ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్ర తీసుకుంటారు.

తెలంగాణలో మొత్తం 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి భారీ సంఖ్యలో దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున వీరందరికీ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం కష్టంగా భావించిన కమిషన్‌.. ఆఫ్‌లైన్‌లోనే పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందు నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో నిర్ధిష్ట కటాఫ్‌ సాధించిన వారందరికీ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Tags:    

Similar News