తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ వాకాటి కరుణ ఫలితాలు రిలీజ్ చేస్తారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77,942 మంది హాజరైన విషయం తెలిసిందే.
ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహిస్తోంది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి.