EAMCET Notification : నేడు టీఎస్ ఎంసెట్ -2024 నోటిఫికేషన్

Update: 2024-02-21 06:29 GMT

నేడు టీఎస్ ఎంసెట్ -2024 నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొ.డీన్ కుమార్ ప్రకటించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఎస్సెట్న జేఎన్టీయూ హెచ్ నిర్వహిస్తోంది. బుధవారం నోటిఫికేషన్ ను విడుదల చేసి, 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించనున్నారు.

రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ మధ్యలో విద్యార్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర కు సంబం ధించిన 100 శాతం సిలబస్ టీఎస్ ఎప్సట్ను నిర్వహించనున్నారు.

Tags:    

Similar News