Income Tax Saving Hacks : రూ.15.85 లక్షల జీతం ఉన్నా సున్నా పన్ను.. కొత్త రూల్స్ చూశారా?
Income Tax Saving Hacks : మధ్యతరగతి ఉద్యోగులకు ఐటీ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి ఏటా కష్టపడి సంపాదించిన జీతంలో సింహభాగం పన్నుల రూపంలో పోతోందని బాధపడేవారికి 2026-27 ఆర్థిక సంవత్సరం కొత్త నిబంధనలు ఊరటనిస్తున్నాయి. తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఏటా రూ.15.85 లక్షల ప్యాకేజీ ఉన్నప్పటికీ, మీరు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఈ టాక్స్ జాక్‌పాట్ వెనుక ఉన్న అసలు లెక్కలేంటో చూద్దాం.
మీల్ వోచర్
కొత్త టాక్స్ విధానంలో పాత మినహాయింపులు చాలా వరకు పోయినప్పటికీ, సెక్షన్ 115BAC కింద మీల్ వోచర్స్ ఉద్యోగులకు పెద్ద ఆయుధంగా మారాయి. నిబంధనల ప్రకారం.. ఒక పూట భోజనానికి రూ.200 చొప్పున, రోజుకు లంచ్, డిన్నర్ కలిపి రూ.400 వరకు మినహాయింపు పొందవచ్చు. నెలలో 22 పని దినాలను లెక్కగడితే, నెలకు రూ.8,800 చొప్పున ఏడాదికి ఏకంగా రూ.1,05,600 మీ గ్రాస్ శాలరీ నుంచి టాక్స్ లేకుండా తగ్గిపోతుంది. మీ శాలరీ స్ట్రక్చర్‌లో ఈ మీల్ వోచర్స్ ఉండేలా చూసుకోవడం వల్ల టాక్సబుల్ ఇన్కమ్ భారీగా తగ్గుతుంది.
రూ.15.85 లక్షల ప్యాకేజీపై సున్నా టాక్స్ లెక్కలివే
ఒకవేళ మీ కంపెనీ మీకు రూ.15.85 లక్షల సీటీసీ ఇస్తోందనుకుంటే, ఈ క్రింది విధంగా ప్లాన్ చేయవచ్చు.
* స్టాండర్డ్ డిడక్షన్: కొత్త నిబంధనల ప్రకారం జీతం పొందే ప్రతి ఉద్యోగికి రూ.75,000 ఫ్లాట్ మినహాయింపు లభిస్తుంది.
* పీఎఫ్ కంట్రిబ్యూషన్: మీ బేసిక్ శాలరీలో (సుమారు రూ.7.92 లక్షలు) కంపెనీ వాటాగా చెల్లించే 12 శాతం పీఎఫ్ (PF) సుమారు రూ.95,100 అవుతుంది. దీనిపై మీకు పన్ను ఉండదు.
* ఎన్పీఎస్ (NPS): సెక్షన్ 80CCD(2) కింద మీ బేసిక్ శాలరీలో 14 శాతం మీ యాజమాన్యం నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో జమ చేస్తే, మరో రూ.1,10,950 మేర టాక్స్ బెనిఫిట్ వస్తుంది.
టాక్స్ సేఫ్ జోన్ లోకి ఇలా..
పైన చెప్పిన మినహాయింపులన్నింటినీ కలిపితే (75,000 + 95,100 + 1,10,950 + 1,05,600) మొత్తం రూ.3,86,650 అవుతుంది. మీ మొత్తం సీటీసీ రూ.15.85 లక్షల నుంచి ఈ మొత్తాన్ని తీసివేస్తే, మీ నికర టాక్సబుల్ ఆదాయం సుమారు రూ.11.98 లక్షల వద్ద నిలుస్తుంది. అంటే రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కొత్త టాక్స్ విధానంలో రిబేట్ లభించడం వల్ల చివరికి మీరు చెల్లించాల్సిన పన్ను సున్నా అవుతుంది.
స్మార్ట్ ప్లానింగ్ అవసరం
అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే మీ కంపెనీ హెచ్ఆర్ పాలసీలో ఈ మార్పులకు అవకాశం ఉండాలి. ముఖ్యంగా మీల్ వోచర్స్ మరియు ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్స్ మీ శాలరీ స్ట్రక్చర్‌లో భాగంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చాలా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల పన్ను భారాన్ని తగ్గించడానికి శాలరీ రీస్ట్రక్చరింగ్కి అనుమతిస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో లక్షల రూపాయల పన్నును ఆదా చేసుకుని మీ టేక్-హోమ్ శాలరీని పెంచుకోవచ్చు.