తెలంగాణలో రెండురోజుల పాటు భారీ వర్షాలు!

తెలంగాణలో గురువారం చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర తెలిపింది.

Update: 2020-08-27 01:10 GMT

తెలంగాణలో గురువారం చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఒకటి రెండుచోట్ల భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశాతీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడీనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా 7.3 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశవైపు తిరిగి ఉన్నది. ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 

Tags:    

Similar News