కరోనా రెండేళ్లలో ఖతం: డబ్ల్యూహెచ్ఓ

స్పానిష్ ప్లూ కంటే వేగంగా కరోనా వైరస్ ను తరిమికొట్టే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు

Update: 2020-08-23 15:02 GMT

స్పానిష్ ప్లూ కంటే వేగంగా కరోనా వైరస్ ను తరిమికొట్టే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీతో కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన అన్నారు. స్పానిష్ ఫ్లూ వచ్చినప్పటి కంటే.. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని.. అనుసంధానం పెరిగిందని అన్నారు. దీంతో ఈ మహమ్మారి తీవ్రంగా విజృంభించింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో స్పానిస్ ఫ్లూ కంటే వేగంగా కరోనాను పరిగెత్తించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రపంచం నుంచి కరోనాను దూరం చేయాడానికి రెండేళ్ల సమయం పడుతుందని టెడ్రోస్ అన్నారు.

Tags:    

Similar News