Ponniyin Selvan : ఐశ్వర్యరాయ్ పై నటి మీనా ఆసక్తికరమైన కామెంట్స్..
Ponniyin Selvan : తాను జీవితంలో మొదటిసారి ఐవ్వర్యను చూసి జెలసీగా ఫీల్ అవుతున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది;
Ponniyin Selvan : పొన్నియిన్ సెల్వన్ చిత్రంపై నటి మీనా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను జీవితంలో మొదటిసారి ఐవ్వర్యను చూసి జెలసీగా ఫీల్ అవుతున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్ర తన డ్రీమ్ రోల్ అని చెప్పింది మీనా. ఐశ్వర్యరాయ్ ఆ పాత్ర వేసి నాలో అసూయ పెంచిందని రాసుకొచ్చింది.
90 దశకంలో దక్షిణాదిలో టాప్ యాక్టర్లతో నటించింది మీనా. సుమారు 90కు పైగా తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, తెలుగు భాషల్లో నటించింది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటించిన అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపింది. పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అయి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.