Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత కలిసిన మాజీ భార్యాభర్తలు.. ఐశ్వర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Aishwarya Rajinikanth: ధనుష్, ఐశ్వర్యల పెద్ద కుమారుడు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు;
Aishwarya Rajinikanth: ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో జరిగిన విడాకుల వ్యవహారాలు చాలావరకు సంచలనంగా మారాయి. ఓవైపు పెళ్లయి నాలుగైదు ఏళ్లయిన వారు విడిపోతుంటే.. మరోవైపు పెళ్లయి 10 ఏళ్లు దాటిపోయిన వారు కూడా వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు. అలాగే కోలీవుడ్‌లో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల విషయం కూడా జీర్ణించుకోవడానికి అభిమానులకు చాలా సమయం పట్టింది. ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు.
ధనుష్, ఐశ్వర్య దూరమయినా కూడా కుటుంబం విషయంలో మాత్రం వారిద్దరూ విడిపోయిన ప్రభావం పడనివ్వలేదు. సమయం కుదిరినప్పుడల్లా తన కొడుకులను కలుస్తూనే ఉన్నాడు ధనుష్. ఇక ఐశ్వర్య కూడా మునుపటిలాగానే ధనుష్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగానే ఉంటోంది. కానీ వీరిద్దరూ ఇప్పటివరకు ఎదురుపడ్డారు లేదా అన్నది సందేహంగానే ఉండేది. తాజాగా వీరు కలిసినప్పుడు ఐశ్వర్య చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ధనుష్, ఐశ్వర్యల పెద్ద కుమారుడు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. అయితే ఆ సందర్భంలో దిగిన ఫోటోలను ట్విటర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది ఐశ్వర్య. 'రోజు చాలా బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్‌గా ప్రమాణం చేస్తున్నాడు' అని ట్వీట్ చేసింది ఐశ్వర్య. అంతే కాకుండా 'గర్వమైన తల్లిదండ్రులు' అంటూ పిల్లలతో దిగిన ఫోటను షేర్ చేసింది.
What a way to start the day ! Monday morning watching the Investiture Ceremony of school ,where my first born takes up oath as sports captain🎖#proudmommymoment #theygrowupsofast 🧡 pic.twitter.com/91GMsGsLhG
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) August 22, 2022