Anushka Shetty: స్టార్ హీరో సరసన అనుష్క రీ ఎంట్రీ.. యాక్షన్ సినిమాతో..

Anushka Shetty: ఇలాంటి సమయంలోనే ఓ స్టార్ హీరో సరసన అనుష్క రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తుందనే వార్త వైరల్ అయ్యింది.

Update: 2022-07-15 14:40 GMT

Anushka Shetty: పదేళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉండి.. ఎన్నో సినిమాలతో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. కానీ హఠాత్తుగా సినిమాలకు దూరమయ్యింది కూడా. తను ఒప్పుకున్న తెలుగు సినిమాల నుండి ఇప్పటికీ ఏ కబురు లేదు. దీంతో స్వీటీ ఫ్యాన్స్.. అసలు మళ్లీ తనను స్క్రీన్‌పైన చూస్తామా లేదా అన్న ఆలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలోనే ఓ స్టార్ హీరో సరసన అనుష్క రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తుందనే వార్త వైరల్ అయ్యింది.

తెలుగులో అనుష్క.. నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో పాటు యూవీ క్రియేషన్స్‌తో కూడా తను ఒక సినిమా చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాల షూటింగ్స్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమాలు పట్టాలెక్కుతాయా లేదా అన్న సందేహం ప్రేక్షకుల్లో ఎక్కువయిపోయింది. ఇదే సమయంలో స్వీటీ మాలీవుడ్ రీ ఎంట్రీ వార్త ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

మాథ్యూస్ థామస్ దర్శకత్వంలో మలయాళ సీనియర్ హీరో సురేశ్ గోపీ నటిస్తున్న చిత్రం 'ఒట్టక్కొంబన్'. ఈ సినిమాలో అనుష్క ఓ కీలక పాత్ర పోషించనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన 'కడువా', 'ఒట్టక్కొంబన్' కథలు ఒకేలా ఉన్నాయని కాంట్రవర్సీ మొదలయ్యింది. వీటన్నింటి మధ్యలో.. అనుష్క 'ఒట్టక్కొంబన్'లో హీరోయిన్ అనే వార్త సినిమాకు మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. 

Tags:    

Similar News