Nayanthara: వివాదాల్లో నయనతార.. చెప్పులేసుకొని మాడవీధుల్లో..
Nayanthara: తిరుమల శ్రీవారిని సినీనటి నయనతార, విగ్నేష్ దంపతులు దర్శించుకున్నారు.;
Nayanthara: తిరుమల శ్రీవారిని సినీనటి నయనతార, విగ్నేష్ దంపతులు దర్శించుకున్నారు. అయితే గుడి ప్రాంగణంలో నయనతార, ఆమె సిబ్బంది చెప్పులు వేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆలయ పవిత్రతను మంటగలిపారని భక్తులు మండిపడుతున్నారు. దర్శనం అనంతరం మాడవీధుల్లో నయనతార, విగ్నేష్ ఫోటో షూట్ నిర్వహించారు. ఆ సమయంలో శ్రీవారి ఆలయం ముందు చెప్పులు వేసుకొని వచ్చారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటో షూట్ జరుగుతున్నంత సేపు ఆలయం దగ్గర గందరగోళం నెలకొంది. దీంతో TTD నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది.