ప్రియుడి ఆత్మహత్య: సింగర్ పరిస్థితి విషమం
ప్రియుడి ఆత్మహత్య: సింగర్ పరిస్థితి విషమం;
రాజస్థాన్ కు చెందిన ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రిలో చేరారు. ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.. దాంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఐసీయూలో ఉన్న ఆమెకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. రేణు నగర్ ఇండియన్ ఐడల్ సీజన్10తోపాటు సరిగమపలో పాల్గొన్నారు. రవిశంకర్ అనే వివాహితుడితో రేణు నగర్ కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.
వీరిద్దరూ ఇటీవల ఇంటి నుంచి కూడా పారిపోయారు. ఆగష్టు 24న పోలీసులు వీరిని తిరిగి రప్పించారు. ఈ క్రమంలో బుధవారం విషం సేవించి రవి శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక రేణు అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.