Kamal Haasan: 'విక్రమ్' మూవీ హిట్.. డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన కమల్..
Kamal Haasan: తమిళంలోనే కాదు తెలుగులో కూడా విక్రమ్.. బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.;
Kamal Haasan: కమల్ హాసన్.. కోలీవుడ్‌లో ఉన్న సీనియర్ స్టా్ర్ హీరోల్లో ఇప్పటికీ టాప్ 1 ప్లేస్‌లో ఉన్న నటుడు. యంగ్ హీరోలు, కొత్త దర్శకులు, క్రియేటివ్ కథలు.. ఇలాంటి అంశాలు అన్ని కమల్‌ను కొన్నాళ్లు వెండితెరకు దూరం చేశాయి. కానీ లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన 'విక్రమ్'తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు కమల్. ఇదే సంతోషంలో ఆయన ఓ లగ్జరీ కారును దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చారు.
తమిళ దర్శకులలో లోకేశ్ కనకరాజ్‌కు ఓ స్పెషల్ మార్క్ ఉంది. రొటీన్ కథలను ఎంచుకోడు, అలా అని కమర్షియాలిటీని మిస్ అవ్వడు. అయినా లోకేశ్ చేసిన ప్రతీ సినిమా హిట్ అవ్వా్ల్సిందే. అందుకే కొద్ది సినిమాల అనుభవంతోనే కమల్ లాంటి స్టా్ర్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు కమల్. విడుదలయిన రోజు మార్నింగ్ షో నుండే విక్రమ్‌కు పాజిటివ్ టాక్ రావడంతో.. మూవీ కలెక్షన్ల విషయంలో కూడా దూసుకుపోతోంది.
తమిళంలోనే కాదు తెలుగులో కూడా విక్రమ్.. బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ కూడా టచ్ అవుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇదే సంతోషంలో డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు ఓ కారును గిఫ్ట్ ఇచ్చాడు కమల్. అయితే ఈ కారు ఖరీదు రూ.50 లక్షలుపైనే ఉంటుందని సమాచారం.