Kiara Advani: కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కియారా.. యంగ్ హీరోకు జోడీగా..
Kiara Advani: తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీలోనే బిజీ అయిపోయింది కియారా.;
Kiara Advani: ఒకప్పుడు సౌత్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి సెటిల్ అయ్యేవారు హీరోయిన్లు. కానీ ఇప్పుడు బాలీవుడ్ నుండి ఏరికోరి సౌత్ సినిమావైపు అడుగులేస్తున్నారు. అలాంటి వారిలో కియారా అద్వానీ కూడా ఒకరు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వైపు ప్రయాణమైన ఈ భామ.. హిట్ల మీద హిట్లు ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా టాలీవుడ్ నుండి కోలీవుడ్ కూడా కియారా వెళ్లనున్నట్టు ప్రచారం మొదలయ్యింది.
'ఎమ్ ఎస్ ధోనీ' చిత్రంతో హిందీలో పాపులారిటీ సంపాదించుకున్న కియారా.. తెలుగులో ఏకంగా మహేశ్ బాబుతోనే డెబ్యూ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' చేసిన అది అంతగా వర్కవుట్ అవ్వకపోవడంతో మళ్లీ ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్‌తో కలిసి శంకర్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది కియారా.
తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీలోనే బిజీ అయిపోయింది కియారా. అక్కడ తనకు అవకాశాలతో పాటు హిట్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇంతలోనే తనకు కోలీవుడ్ నుండి పిలుపు వచ్చిందని టాక్. శివకార్తికేయన్, మడోన్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కియారా హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్టు టాక్. ఇక డాక్టర్, డాన్‌లాంటి చిత్రాలతో హిట్లు కొట్టి ఇతర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు శివకార్తికేయన్.