MADONNA:ఆస్పత్రిలో అమెరికా పాప్ స్టార్ మడోన్నా
ఆస్పత్రిలో చేరిన అమెరికా స్టార్ పాప్ గాయని మడోన్నా....పాప్‌స్టార్‌కు తీవ్ర బాక్టీరియల్ ఇన్ఫెక్షన్... ప్రపంచ యాత్ర వాయిదా....;
అమెరికా స్టార్ పాప్ గాయని మడోన్నా..... అనారోగ్యం పాలయ్యారన్న వార్త సంగీత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ స్టార్ గాయని చాలారోజులు ICUలోనే ఉన్నారని...... ఆమె మేనేజర్ వెల్లడించారు. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ నుంచి మడోన్నా కోలుకున్నా........ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సిన అవసరం ఉందని మేనేజర్ మేనేజర్ గై ఓసీరీ వివరించారు. జూన్ 24 శనివారం మడోన్నాను న్యూయార్క్‌లోని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. క్రమంగా మడోన్నా ఆరోగ్యం మెరుగుపడుతోందని.. ఆమె పూర్తిగా కోలుకునే వరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని డాక్టర్లు సూచించారని తెలిపారు.
మడోన్నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. ప్రపంచ యాత్రతో పాటు అన్ని టూర్లను కమిట్‌మెంట్‌లను తాత్కాలికంగా రద్దు చేశామని మడోన్నా మేనేజర్ వెల్లడించారు. టూర్ కోసం కొత్త ప్రారంభ తేదీని, రీ షెడ్యూల్ చేసిన షో తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కెనడాలోని వాంకోవర్‌లోని రోజర్స్ అరేనాలో జూలై 15న మడోన్నా ది సెలబ్రేషన్ టూర్ పేరుతో ప్రపంచయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ పర్యటన రద్దైంది. జులై 15నుంచి అమెరికా, యూరప్ నగరాల్లో మడోన్నా 84 ప్రదర్శనల ఇవ్వాల్సి ఉండగా........ దీని కోసం సంగీత ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మడోన్నాకు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఈ పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. మెక్సికోలో పలాసియో డి లాస్ డిపోర్టెస్‌లో 2024 జనవరి 30న మడోన్నా ది సెలబ్రేషన్ టూర్ ముగియనుంది. మడోన్నా క్వీన్ ఆఫ్ పాప్‌గా ప్రపంచానికి సుపరిచితం. సామాజిక, రాజకీయ, లైంగిక, మతపరమైన ఇతివృత్తాలతో ఆమె ఎన్నో ఆల్బమ్‌లు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఆమె ఖ్యాతి గడించారు. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఆల్బమ్ అమ్మకాలతో మడోన్నా గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.