Mamatha Mohandas: రంగు కోల్పోతున్న రాఖీ భామ....
చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మమతా మోహన్ దాస్; ఎమోషనల్ పోస్ట్....;
నిన్నటి వరకూ క్యాన్సర్ మహమ్మారితో పోరాడిన మమతా మోహన్ దాస్ ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అయితే మరోసారి అమ్మడు ఆనారోగ్యం పాలైంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
విటిలిగో అనే చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది మమత. సూర్యుడిని ఉద్దేశిస్తూ ఓ క్రిప్టిక్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇకపై సూర్యడు ఉదయించకముందే లేచి, రంగు కోల్పోతున్న వేళ అతడి తొలికిరాణాలను ఆశ్వాదించనున్నట్లు పోస్ట్ లో పేర్కొంది.
విటిలిగోతో బాధపడేవారిలో చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడి కాలక్రమేణా అవి పెరిగి పెద్దవి అవుతాయి. క్రమంగా శరీరమంతా వ్యాపించి, చర్మం సహజరంగు కోల్పోతుంది. మెలనిన్ డెఫిషియెన్సీ వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని తెలుస్తోంది.
రాఖీ... రాఖీ అంటూ తెలుగు వారి హృదయాలను తాకిన ఈ మళయాళీ ముద్దుగుమ్మ గాయనిగా పరిచయమై, నటిగా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. తరువాత దుబాయ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే క్యాన్సర్ బారిన పడిన మమత ఇప్పుడిప్పుడే ఆనారోగ్యం నుంచి కోలుకుంటోంది. తమిళ, మళయాళ భాషల్లో నటిస్తూ బిజీగా మారుతోంది.