Nassar: షూటింగ్‌లో నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
Nassar: ప్రముఖ నటుడు నాజర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.;
Nassar: ప్రముఖ నటుడు నాజర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ జరుగుతుండగా.. మెట్లపై నుంచి దిగుతూ నాజర్ జారిపడ్డారు. దీంతో ఆయన్ను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అయితే చిన్న గాయమేనని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నటి సుహాసిని, హీరోయిన్ మెహ్రీన్, శియాజీ షిండేతో తమిళ సినిమాకు షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.