Nayan Vignesh: నయనతార, విఘ్నేష్ పెళ్లి టీజర్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్..
Nayan Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియోను ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్’ టైటిల్‌తో విడుదల చేయనుంది నెట్‌ఫ్లిక్స్.;
Nayan Vignesh: కోలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగా ఉండదు. కానీ చాలాకాలం తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతలోనే వీరి వెడ్డింగ్ మూవీ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
నయన్, విఘ్నేష్ పెళ్లిపై కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కూడా ఆసక్తి చూపించడంతో వీరి పెళ్లి వీడియోను స్ట్రీమ్ చేస్తే బాగుంటుంది అనుకుంది ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. అందుకోసమే ఆ వీడియో రైట్స్‌ను రూ.25 కోట్లు పెట్టి కొనుక్కుందని సమాచారం. అందుకే వీరి వెడ్డింగ్ ఫిల్మ్‌పై ప్రేక్షకులు ఎదురుచూసేవరకు ఆగి నెట్‌ఫ్లిక్స్.. ఓ పోస్ట్‌ను పెట్టింది. అందులో వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నుండి మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది.
ఇక నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియోను 'నయనతార బియాండ్ ది ఫెయిరీటెయిల్' అనే టైటిల్‌తో విడుదల చేయనుంది నెట్‌ఫ్లిక్స్. అంతకంటే ముందు ఈ వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇందులో నయనతార.. విఘ్నేష్ గురించి, విఘ్నేష్.. నయనతార గురించి బాగా చెప్పారు. ఇక కొద్దిగంటల్లోనే ఈ పోస్ట్‌కు వేలల్లో లైకులు వచ్చిపడ్డాయి.