Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
Oscar Award: ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న సినిమాలకు ఆస్కార్ పెద్ద షాకే ఇచ్చింది.;
Oscar Award: కోవిడ్ అనేది ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టిన తర్వాత సినిమా రంగంపై కూడా దీని ప్రభావం చాలానే పడింది. కానీ సినిమానే నమ్ముకునే జీవించే కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వారికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతో మేకర్స్.. సినిమాలను ఓటీటీలో నేరుగా విడుదల చేయడం మొదలుపెట్టారు. అయితే అలా విడుదలవుతున్న సినిమాలకు ఆస్కార్ పెద్ద షాకే ఇచ్చింది.
ఆస్కార్ బరిలో నిలవాలంటే ఎన్నో కఠినమైన నియమనిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి ఓటీటీలో విడుదలయిన సినిమాలకు ఆస్కార్ ఎంట్రీ లేకపోవడం.. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉండడం ఈ నిబంధనను కాస్త సడలించింది ఆస్కార్. థియేటర్లలో విడుదలయితేనే ఆస్కార్ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పాటు ఆస్కార్ మరిన్ని నిబంధనలను కఠినతరం చేసింది.
ఇంతకు ముందు ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఒక సినిమాలోని ఎన్ని పాటలైనా పంపించే అవకాశం ఉండేది.. కానీ ఇప్పుడు కేవలం సినిమాలోని మడు పాటలకు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు. బెస్ట్ సౌండింగ్ విభాగంలో పోటీ పడాలంటే ముందుగా సౌండ్ బ్రాంచ్ మెంబర్స్ ఆ సినిమాను చూసి ఓకే చేయాలని రూల్ పెట్టింది ఆస్కార్. అయితే ఇలాంటి కొత్త నిబంధనల వల్ల, ముందు ఉన్న నిబంధనలను సడలించడం వల్ల ఈసారి ఆస్కార్ చిన్న సినిమాలకు దక్కడమే కష్టం అనుకుంటున్నారు పలువురు మేకర్స్.