SALAAR TEASER: మాస్ లుక్‌తో ప్రభాస్ ఊచకోత
అంచనాలను పెంచేసిన సలార్ టీజర్.... అదిరిపోయిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్... రెండు పార్టులుగా సలార్;
డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసిన సలార్ టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ యాక్షన్ లుక్ ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసి పడేసింది. దాదాపు 106 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాల్ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఇవాళ తెల్లవారుజామున సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో...’ అంటూ టీనూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైన టీజర్ చూస్తుంటే.. ప్రభాస్ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని మాస్ అంశాలను పుష్కలంగా మేళవించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్‌ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్.. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు.
ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు కేజీఫ్ సినిమా కథని ఎలా అయితే ఒక వ్యక్తి నేరేట్ చేసుకుంటూ వెళతాడో ఈ సలార్‌లో టీనూ ఆనంద్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీనూ డైలాగ్ మొత్తం ఇంగ్లీష్‌లో పెట్టేయడంతో ఇంక వేరే భాషలో సెపరేట్‌గా ఆ డైలాగ్ చెప్పనవసరం లేదు. ఈ టీజర్‌లో ప్రభాస్‌ను పూర్తిగా చూపించలేదు. మిగతా క్యారెక్టర్స్‌ను పెద్దగా చూపించలేదు. ప్రభాస్ ఫేస్ మాత్రం చూపించకుండా పిడికిలి బిగించిన తన చేతిని మాత్రమే చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫినిషింగ్‌లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను చూపిస్తూ టీజర్‌ను ముగించారు.
సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందని టీజర్‌లో చెప్పేశారు. సలార్ పార్ట్1: సీజ్‌ఫైర్’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతిహాసన్ ప్రభాస్‌కు జంటగా నటిస్తుండగా, విలన్ రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు, , మరో విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. తమిళ నటి శ్రియారెడ్డి కూడా కీలకపాత్ర పోషించింది.టీజర్ అదిరిపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.