Samantha: మాలీవుడ్‌లో సమంత ఎంట్రీ.. ఆ క్రేజీ హీరోతో కలిసి..
Samantha: కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే నటించినా కూడా సౌత్ క్వీన్‌గా మారిపోయింది సమంత.;
Samantha: కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే నటించినా కూడా సౌత్ క్వీన్‌గా మారిపోయింది సమంత. ప్రస్తుతం సమంత ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ప కూడా ప్రేక్షకుల చూపు ఉంది. సౌత్‌లో క్రేజీ హీరోయిన్ ఎవరూ అంటే చాలామంది సమాధానం సమంతనే. అయితే ఇప్పటికే తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సత్తాచాటిన సమంత.. త్వరలోనే మలయాళంలో కూడా అడుగుపెట్టనుందని టాక్.
'ఏం మాయ చేశావే'తో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సమంత.. వెంటనే తమిళంలో కూడా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళంలో బ్యా్క్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. కెరీర్ మొదట్లోనే గోల్డెన్ లెగ్ అన్న పేరు రావడంతో సామ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం సమంత తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్నా.. తన ఫోకస్ బాలీవుడ్‌పై ఉందని టాక్ వైరల్ అయ్యింది.
బాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోల సరసన సమంత డెబ్యూ గ్రాండ్‌గా ఉండనుందని టాక్ వినిపిస్తుండగా.. ఇప్పుడు మరో రూమర్ వైరల్ అయ్యింది. దుల్కర్ సల్మాన్‌తో జతకడుతూ సమంత తన మాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందట. అభిలాష్ జోషీ తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇప్పటికే 'మహానటి' చిత్రంతో సమంత, దుల్కర్ స్క్రీన్ షేర్ చేసుకోగా ఇప్పుడు 'కింగ్ ఆఫ్ కోతా'లో హీరోహీరోయిన్‌గా అలరించనున్నారు.