Shraddha Srinath: మీడియాపై హీరోయిన్ ఫైర్.. ఆపై ట్విటర్ నుండి ఔట్..
Shraddha Srinath: వరుస ట్వీట్లతో వారిని టార్గెట్ చేస్తూ వారికి చుక్కలు చూపించింది. తను మరెవరో కాదు శ్రద్ధా శ్రీనాథ్.;
Shraddha Srinath: మామూలుగా కొంతమంది నటీనటులు పేర్ల విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. తమ పేరును ఎవరైనా తప్పుగా పలికినా, రాసినా వారికి నచ్చదు. అలాగే తాజాగా ఓ హీరోయిన్ పేరును ఓ మీడియా వైబ్‌సైట్ తప్పుగా రాసింది. తన ఫోటో పెట్టి వేరే హీరోయిన్ పేరు రాసుకొచ్చింది. దీంతో వరుస ట్వీట్లతో వారిని టార్గెట్ చేస్తూ వారికి చుక్కలు చూపించింది. తను మరెవరో కాదు శ్రద్ధా శ్రీనాథ్.
శ్రద్ధా పేరుతో సినీ పరిశ్రమలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందుకే ఓ ఇంగ్లీష్ మీడియా వెబ్‌సైట్ శ్రద్ధా శ్రీనాథ్ ఫోటోను పెట్టి శ్రద్ధా దాస్ అని రాసుకొచ్చింది. ఆ ఫోటో తన కంటపడడంతో దానిని ట్వీట్ చేస్తూ 'ఏ ఇంటర్న్ ఈ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్నారారు బాబు. పైగా దీనికి 861వేల మంది ఫాలోవర్స్' అని పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'నా పేరును సరిగ్గా పలికేవారిని నేను చాలా అభినందిస్తాను. మీ కీబోర్డ్ దాస్, కపూర్ అని చూపించినా కూడా శ్రీనాథే కరెక్ట్ అని మీ మనసు చెప్తుంది. నేను మిమ్మల్ని అభినందిస్తాను' అని మరో ట్వీట్ చేసింది చేసింది శ్రద్ధా శ్రీనాథ్.
Which intern is handling this account ra babu. 861k followers 🙊 https://t.co/EGGwFDUqFU
— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022
I appreciate people who get my name right. So much. Even though your keyboard suggests Das or Kapoor, every fibre of your body tells you that Srinath is the one to type. I appreciate you. I see you. You are loved.
— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022
'ఇన్‌స్టాగ్రామ్‌లో నేను నా పేరును శ్రద్ధా రమా శ్రీనాథ్ అని మార్చుకున్నాను. ఇక్కడ కూడా మార్చాలేమో. రమా మా అమ్మ పేరు. అందుకే ఇప్పటినుండి ప్రతిచోట నన్ను నేను శ్రద్ధా రమా శ్రీనాథ్ అనే పరిచయం చేసుకుంటాను. చూస్తూ ఉండండి.' అని ట్వీట్ చేసిన శ్రద్ధా నాలుగు నెలలు తను ట్విటర్ నుండి దూరంగా ఉండనున్నట్టు ప్రకటించింది. దీని వల్ల కొందరు నెటిజన్లు ఓ పేరు వల్ల శ్రద్ధ ఇంత ఫైర్ అవ్వడమేంటి అనుకుంటుండగా.. మరికొందరు మాత్రం తను చేసింది కరెక్టే అని సమర్ధిస్తున్నారు.
On Instagram though i changed my name to Shraddha Rama Srinath. Maybe i should change it here too. Rama is my mom's name. Henceforth will consciously introduce myself as Shraddha Rama Srinath everywhere. Watch me.
— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022
You guys don't worry about this though ☝️this is for me. Just... Just call me Shraddha Srinath. Not das or Kapoor. It's a huge ask i know, especially for interns handling big film accounts. But please, do it for the sake of the journalism school you never graduated from
— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022
Okay enough Twitter for the next 4 months thank you for your sassy replies byeeee
— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022