Srinidhi Shetty: అవకాశాలు దక్కించుకోలేకపోతున్న 'కేజీఎఫ్' బ్యూటీ.. అదే కారణమా..?

Srinidhi Shetty: కేజీఎఫ్ ద్వారా యశ్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో.. శ్రీనిధి శెట్టికి కూడా అంతే క్రేజ్ లభించింది.

Update: 2022-05-28 12:30 GMT

Srinidhi Shetty: 'కేజీఎఫ్' సినిమా శాండిల్‌వుడ్ సత్తా ఏంటో దేశవ్యాప్తంగా తెలియజేసింది. కన్నడ సినీ పరిశ్రమ నుండి కూడా ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ప్రోత్సహించింది. అయితే ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది శ్రీనిధి శెట్టి. తొలి సినిమాతోనే అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయమయిన శ్రీనిధి.. మూవీ రిజల్ట్‌కు తగినట్టుగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.

కేజీఎఫ్ ద్వారా యశ్‌కు, ప్రశాంత్ నీల్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో.. శ్రీనిధి శెట్టికి కూడా అంతే క్రేజ్ లభించింది. అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలవ్వక ముందే తమిళంలో విక్రమ్ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత హీరోయిన్‌కు అవకాశాలు ఇవ్వడంలో మేకర్స్ ముందుంటారు. కానీ శ్రీనిధి మాత్రం తన క్రేజ్‌కు తగినట్టుగా అవకాశాలు అందుకోవడం లేదు.

తొలి చిత్రం హిట్ అవ్వగానే శ్రీనిధి తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిందట. టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోయిన్లకు సమానంగా డిమాండ్ చేస్తుందట శ్రీనిధి. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారట. తన రెమ్యునరేషన్ కారణంగానే శ్రీనిధి ఎక్కువగా సినిమాల్లో ఒప్పుకోవట్లేదని ఫిల్మ్ సర్కి్ల్లో రూమర్ వినిపిస్తోంది. అందుకే ఇప్పటివరకు తను ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు.

Tags:    

Similar News