Dwayne Johnson: ది రాక్ చేసిన ఆ యాడ్.. వెబ్ సిరీస్ గా మారనుందా?
2017లో యాపిల్ 7 కోసం యాడ్ చేసిన డ్వేన్ జాన్సన్... ఇప్పుడు దానినే వెబ్ సిరీస్‌గా తెచ్చేందుకు యత్నాలు...;
సినీ ప్రపంచానికి డ్వేన్ జాన్సన్( Dwayne Johnson) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ది రాక్( The Rock) అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే డ్వేన్... కండలు తిరిగిన దేహంతో యాక్షన్ సీన్లలో అదరగొడతాడు. ది మమ్మీ రిటన్స్, ది స్కార్పియన్ కింగ్, ది గేమ్ ప్లాన్, జుమాంజి, జంగిల్ క్రూయిస్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్( Fast and Furious 6 ), బ్లాక్ ఆడమ్, జంగిల్ క్రూజ్, రెడ్ నోటీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు, ఇప్పుడు ది రాక్ జీవితం వెబ్ సిరీస్‌గా రానుందా... దీని కోసం యాపిల్ టీవీ ప్లస్ ప్రణాళిక రచిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
2017వ సంవత్సరంలో డ్వేన్ జాన్సన్ ఐఫోన్ 7 కోసం ఒక వాణిజ్య ప్రకటన( Apple’s overly creative 3-minute advertisement) చేశారు. మూడు నిమిషాల ఆ ప్రకటనలో డ్వేన్ జాన్సన్ జీవితం ఎంత బిజీగా ఉంటుందో.. ఎంత కష్టంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే వీడియో ది రాక్ జీవితాన్ని తెరపై చూపించేందుకు ప్రేరణగా నిలుస్తోంది. ఇంతకీ ఆ వీడియోలు ఏముంది అంటే...
హాలీవుడ్(Hollywood )లో జీవితం చాలా కష్టంగా ఉంటుందని, గడువు తేదీలు, అధిక అంచనాలను అందుకోవడానికి నటులు పడే కష్టాన్ని ఆ వీడియోలు చూపించారు. కానీ వీటన్నింటినీ ది రాక్ ఎలా ఎదుర్కొన్నాడో అందులో చూపించారు. ది రాక్‌కు పరిమితులు లేవని, పని రాక్షసుడిగా జాన్సన్ తన జీవితాన్ని ఎలా గడుపుతున్నారో ఇందులో చెప్పారు. చాలా మందికి ప్రేరణగా నిలిచేందుకు తాను ఎంత కష్టపడుతున్నాడో వివరించారు. తాను చేసే పనిని దోషరహితంగా ఉంచేందుకు ది రాక్ ఎంత శ్రమిస్తున్నాడో ఆ దృశ్యాల్లో మనం చూడొచ్చు.
ది రాక్‌కు పరిమితి లేదని ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పారు. జాన్సన్ జుమాంజీ, జంగిల్ క్రూజ్ వర్క్ షెడ్యూల్‌ను కూడా ఇందులో చూపించారు. అతను కొత్తగా ఇంకేమైనా చేయగలడా అని అక్కడున్న వారు ఆలోచిస్తున్నారు. జాన్సన్ సవాలకు వెనక్కి తగ్గేవాడు కాదు. ఛాలెంజ్‌ని ధీటుగా స్వీకరించి ముందుకెళ్లేవాడు.
కానీ యాపిల్ రూపొందించిన ఈ యాడ్ ఎక్కువమందికి చేరువకాలేకపోయింది. అభిమానులు అసలు దీనిని పట్టించుకోలేదు కూడా. డ్వేన్ జాన్సన్ నటించిన కమర్షియల్ యాడ్ ఫ్లాప్ అని చెప్పడం తప్పకపోయినా జరిగింది అదే. దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. యాపిల్ సిరి ఈ ప్రకటనలో చూపించినట్లుగా ఉంటే దానిని చెత్త బ్యాగ్‌లో విసిరి ఉండేవాడినని కొందరు కామెంట్లు కూడా చేశారు. అభిమానులు డ్వేన్ సిరి సీక్వెల్ చూస్తారని దీని అర్థం కాదని ఆశిస్తున్నారు. ఇంతటి విమర్శల మధ్య ఇప్పుడు దీనిని వెబ్ సిరీస్‌గా తీసుకురావాలని Apple TV+ భావిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.