Yash: తమిళ స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..
Yash: యశ్.. ప్రస్తుతం నర్తన్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఓ తమిళ డైరెక్టర్‌తో యశ్ పని చేయనున్నాడట.;
Yash: ప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమల్లో శాండిల్‌వుడ్‌కు కూడా ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇదంతా 'కేజీఎఫ్' చిత్రం వల్లే సాధ్యమైంది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్‌కు అన్ని భాషల్లో అభిమానులు ఎక్కువయిపోయారు. ప్రస్తుతం యశ్ తరువాతి సినిమాలపై అన్ని భాషల ప్రేక్షకుల్లో ఫోకస్ పెరిగింది. ఇదే సమయంలో ఈ హీరో.. ఓ తమిళ డైరెక్టర్‌తో చేతులు కలపనున్నాడని టాక్ వినిపిస్తోంది.
కేజీఎఫ్ రెండు చాప్టర్లు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో రాకీ అనే పాత్రను ఆపేయాలని తనకు లేదని, కేజీఎఫ్‌కు చాప్టర్ 3 కూడా ఉండబోతుందని ప్రశాంత్ నీల్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. సలార్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్‌టీఆర్‌తో కూడా మూవీ ప్లాన్ చేశాడు. కాబట్టి కేజీఎఫ్ చాప్టర్ 3కి ఇంకా సమయం పట్టేలా ఉంది. మరోవైపు యశ్ కూడా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.
యశ్.. ప్రస్తుతం నర్తన్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఓ తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో యశ్ నటించనున్నాడట. అతడు మరెవరో కాదు శంకర్. శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఆర్‌సీ 15 సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత యశ్, శంకర్ కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇక డైరెక్టర్ శంకర్ కూడా వరుసగా పాన్ ఇండియా హీరోలతోనే సినిమాలు చేస్తూ.. మళ్లీ ఫామ్‌లోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.