Paanch Minar Review : పాంచ్ మినార్ హిట్ కొట్టిందా.? ఫట్ మనిపించిందా..?

Update: 2025-11-20 11:22 GMT

రివ్యూ : పాంచ్ మినార్

ఆర్టిస్ట్స్    : రాజ్ తరుణ్, రాశి సింగ్, అజయ్ ఘోష్, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, బ్రహ్మాజీ, నితిన్ ప్రసన్న తదితరులు

ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది

నిర్మాతలు : మాధవి అద్దంకిRaj Tarun, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి

దర్శకత్వం : రామ్ కడుముల

రాజ్ తరుణ్ మూవీ అంటే ఆడియన్స్ లో మాగ్జిమం ఇంట్రెస్ట్ పోయింది. ఈ మధ్య కాలంలో వస్తోన్న మూవీస్ అన్నీ ఇబ్బంది పెట్టినవే. ఈ టైమ్ లో పాంచ్ మినార్ అనే మూవీతో వచ్చాడు. ఈ మూవీ రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేయడం మాత్రం కాస్త ఆకట్టుకుంది. మరి ఈ పాంచ్ మినార్ ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.

కథ :

కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు (రాజ్ తరుణ్) పెద్దగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని లవర్ ఖ్యాతి (రాశి సింగ్) కూడా అతనికి ఓ జాబ్ చేయించమని పోరు పెడుతుంది. పెద్దగా టాలెంట్ లేని కిట్టు ఇందుకోసం అతను క్యాబ్ డ్రైవర్ గా మొదలుపెడతాడు. కానీ ఆమెకు తెలియకుండా జాబ్ చేస్తా అని అబద్ధం చెబుతుంటాడు. కిట్టూ తనకు చెవుడు అని తెలిస్తే ఎక్కువ క్యాబ్ డబ్బులు వస్తాయని తెలిసి మొదలుపెడతాడు. కట్ చేస్తే చెవుడుగా ఉన్న అతనికి ఇద్దరు క్యాబ్ బుక్ చేస్తాడు. అదే రోజు అతను ఒక మర్డర్ చేసి అతన్ని కూడా చంపేయాలని ప్రయత్నిస్తాడు. మరి ఆ ప్రయత్నంలో అతను ఏ మేరకు తప్పుకున్నాడు. వాళ్లెందుకు మర్డర్ చేస్తారు..? మర్డర్ వెనక ఉన్న ఐదు కోట్ల ప్లాన్ కిట్టుకు ఎలా తెలుసు..? అసలు మర్డర్ చేయించేది ఎవరు..? అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

రాజ్ తరుణ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడీ మూవీ విషయంలో. ఇది నిజమే అని తెలుస్తుంది.. సినిమా అరగంట తర్వాత అర్థం అవుతుంది. ఆ తర్వాత చివరి వరకు ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ కడుముల. సింపుల్ గా చూస్తే ఇది ఒక క్రైమ్ కామెడీ. ఈ పాయింట్ ను మొదలు పెట్టేందుకు సినిమా ఇబ్బంది అవుతుంది కానీ.. క్రైమ్ కామెడీ యాడ్ అయిన తర్వాత నాన్ స్టాప్ గా మెప్పించాడు దర్శకుడు. రాజ్ తరుణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఎక్కడా డీవియేట్ అవలేదు.

ఒక హత్య, దాని వెనక ఉన్న డబ్బు ఉండే ఒక వ్యక్తి, అతని ఇబ్బంది పెట్టే పోలీస్, తెలియకుండా వచ్చిన డబ్బు వల్ల హీరో లాభ పడుతూనే ఎక్కువ సమస్యలు ఫేస్ చేయడం.. అతన్ని చంపిన వారే అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం.. డబ్బు చుట్టూ వల్ల హీరో ఫ్యామిలీ, లవర్, ఫ్రెండ్ వల్ల కూడా కలిగే అనర్థాలు.. చివరికి హీరోఅండ్ ఫ్యామిలీ, విలన్స్, పోలీస్, అతన్ని చంపిన వారంతా ఒకే చోట పోవడం .. ఆఖర్లో హ్యాపీ ఎండింగ్ .. ఇదీ సింపుల్ గా కనిపించే కథ. కాకపోతే ఎవరు, ఎవరికి ఏం అవుతారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ట్విస్ట్ లు, కామెడీ, థ్రిల్స్ అన్నీ కలిసి సినిమా ఆసాంతం మెప్పించేస్తుంది.

రాజ్ తరుణ్ చాలా హైలెట్ అయ్యాడు. హీరోయిన్ మెప్పించింది. అజయ్ ఘోష్, లక్ష్మణ్ కామెడీ హైలెట్ గా ఉంటుంది. బ్రహ్మాజీ, సుదర్శన్ కామెడీ బాగా నవ్విస్తుంది. నితిన్ ప్రసన్న హైలెట్ అయ్యాడు. విలన్స్ గా ఆకట్టుకునే ఇద్దరు మనుషులు బాగా ఆకట్టుకున్నారు. శ్రీనివాస రెడ్డి సైతం నవ్వించడం బావుంది.

మైనస్ లు చూస్తే సినిమా అరగంట మాత్రం బోర్ కొడుతుంది. అవసరం లేని పాటలతో ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మరీ హైలెట్ అనిపించేలానూ ఉంటుంది క్రైమ్ కామెడీ. అదే టైమ్ లో క్రైమ్ కామెడీయే ఎక్కువగా ఆకట్టుకుంటుంది కూడా.

టెక్నికల్ గా మ్యూజిక్ బావుంది. నాన్ టైమింగ్ లో పడినా పాటలు బావున్నాయి. సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బావుంది. డైలాగ్స్ ఓకే. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు రామ్ కడుముల మాత్రం విషయం ఉన్న దర్శకుడే అనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ హైలెట్ గా చేశాడు. క్లాస్ ను మెప్పించేలా ఎలాంటి అసభ్యత లేకుండా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా అందించాడు.

ఫైనల్ గా : పాంచ్ మినార్ - కామెడీ ష్యూర్

రేటింగ్ : 2.75/5

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News