రివ్యూ : కన్నప్ప
ఆర్టిస్ట్స్ : మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు
ఎడిటర్ : ఎడిటర్
సంగీతం : స్టీఫెన్ దేవస్సీ
సినిమాటోగ్రఫీ : షెల్డన్ చౌ
నిర్మాత : మోహన్ బాబు
దర్శకత్వం : ముఖేష్ కుమార్ సింగ్
కన్నప్ప కథను మంచు విష్ణు తీయబోతున్నాడని తెలిసినప్పటి నుంచి కొన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. అంతకు ముందే ఆ ఫ్యామిలీపై ఇలాంటివి ఉన్నాయి. ఈ మూవీ అనౌన్స్ అయిన తర్వాత మరింత పెరిగాయి. అవన్నీ పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళ్లిన విష్ణు.. ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ను తీసుకు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ట్రైలర్ పై నెగెటివిటీ రాలేదు. అలాగని ఆహా ఓహో అని కూడా అనలేదు. మరి ఈ శుక్రవారం విడుదలైన కన్నప్ప ఎలా ఉందో చూద్దాం.
కన్నప్ప కథ గురించి తెలుగు వారిలో చాలామందికి తెలుసు. పైగా బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో సినిమా కూడా వచ్చింది. సో.. కథా పరంగా చూసుకుంటే ఇది చిన్నదే. తిన్నడు అనే ఓ బోయవాడు.. కాల క్రమంలో శివ భక్తుడుగా ఎలా మారాడు. శివుడు కోసం తన కళ్లను ఎలా త్యాగం చేశాడు.. ఆ కారణంగా అతనికి కన్నప్ప అనే పేరు వచ్చింది అనేది కథ. ఈ కథను ఎంత జనరంజకంగా చెప్పారు అనేదే అసలు పాయింట్. నిజానికి ఇందులో కమర్షియల్ పాయింట్ అంటే తిన్నడు తన కళ్లను ముక్కంటి అయిన శివుడికే ఇవ్వడం. ఆ ముందు ఏం జరిగింది అనే విషయంలో ఎవరికి తోచింది వారు ఊహించుకోవచ్చు. అలా ఇది మా ఊహ అంటూ.. తిన్నడి కథను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కల్పిత పాత్రలతోనే ఈ చిత్రాన్ని తీశాం అని ముందే డిస్ క్లెయిమర్ వేయడం మంచిదైంది.
ఈ కన్నప్ప (విష్ణు) విషయానికి వస్తే.. చిన్నతనం నుంచే దేవుడంటే ద్వేషం. అందుకు సరిపడా ఓ కారణం. ఆ ద్వేషంతో తనతో పాటే పెరుగుతుంది. తండ్రి (శరత్ కుమార్)తో పాటు తన గూడెంలో అందరి తలలో నాలుకలా ఉంటాడు. బోయవాడే అయినా విలు విద్యలో ఆరితేరి ఉంటాడు. బలిష్టుడు. ఓ రోజు వేటకు వెళ్లి నెమలి( ప్రీతి ముకుందన్)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. స్వర్ణముఖీ నదికి ఆవలి తీరంలో ఉండే ‘వాయులింగం’ను మహదేవ శాస్త్రి( మోహన్ బాబు) మాత్రమే పూజిస్తుంటాడు. ఆ వాయులింగాన్ని దోచుకుందాం అని ‘కాలా ముఖ’అనే తెగకు చెందిన వ్యక్తులు ప్రయత్నిస్తారు. తనకు తెలియకుండానే ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. దీంతో ఆ తెగ మొత్తం వీరిపై తిరుగుబాటు చేస్తుంది. మరి ఈ క్రమంలో చిన్న చిన్న గూడేలకు చెందిన వీరు ఆ కాలాముఖులను ఎదుర్కొన్నారా..? తిన్నడు, నెమలి ప్రేమ ఏమవుతుంది..? తిన్నడికి శివుడుపై భక్తి కలగడానికి కారణమైన వ్యక్తి ఎవరు..? అనే పాయింట్ అసలు కన్నప్ప కథ సెకండ్ హాఫ్ లో ఓ అరగంట తర్వాత మొదలవుతుంది.
ముందే చెప్పినట్టు.. ఈ తిన్నడి కథకు మరీ ఎక్కువ పేజీలేం ఉండవు. అందుకే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేశాడు దర్శకుడు. అందుకోసం బాహుబలి రిఫరెన్స్ లు చాలానే కనిపిస్తాయి. ఆ కారణంగా కొంత ఇబ్బందిగా ఫీలవుతాం. కొత్త క్రియేటివిటీ చూపించి ఉంటే బావుండేది. ఇతర తెగల నాయకులు, వారి ఆహార్యం(గెటప్స్) కనెక్టింగ్ గా ఉండవు. ఆ పాత్రలూ రిజిస్టర్ కావు. కామెడీ కోసం పెట్టిన బ్రహ్మానందం, సప్తగిరి ఎపిసోడ్ సినిమా నిడివి పెంచింది కానీ ఉపయోగపడలేదు. మోహన్ లాల్ ఎంట్రీతో కథలో ఓ సీరియస్ నెస్ స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్ లోనే తిన్నడు, అర్జునుడు మద్య సంబంధం తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా గేర్ పూర్తిగా మారుతుంది. కథనం రసకందాయంలో పడుతుంది. అక్కడి నుంచి ఏ వంకా పెట్టే అవకాశం ఇవ్వలేదు. మంచి స్క్రీప్ ప్లే, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ అన్నీ బాగా కుదిరాయి. ముఖ్యంగా ఈ 40 నిమిషాల ఎపిసోడ్ లో ప్రధానంగా ప్రభాస్ ఓ 15 నిమిషాలు ఉంటాడ. ఆ ఇంపాక్ట్ మాత్రం క్లైమాక్స్ వరకూ కంటిన్యూ అవుతుంది. విష్ణు అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు మధ్య ఎపిసోడ్స్ బావున్నాయి. అలాగే ప్రతీ ముకుందన్ సైతం మంచి నటనతో మెప్పించింది. కానీ ఆమెతో అవసరానికి మించిన ఎక్స్ పోజింగ్ చేయించడం మాత్రం బాలేదు. సింపుల్ గా చెబితే తిన్నడు ఏం చేశాడో ఎవరికీ పెద్దగా తెలియదు. అందుకే ఈ తిన్నడు తన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు. కానీ కన్నప్పగా మాత్రం అతనూ ఇతనూ అదే స్థాయిలో మెప్పించారు అని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో గొప్పగా నటించాడు విష్ణు.
మైనస్ ల పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా డల్ గా సాగుతుంది. రెండు పాటల్లో గ్లామర్, డ్యాన్సులు శృతి మించి కనిపించాయి. చాలా వరకు బాహుబలిని గుర్తుకు తెచ్చే సీన్స్ కనిపించాయి. తొలి సగంలో ఎక్కడా శివుడు, తిన్నడు అనే ప్రస్తావనే ఉండదు. కాకపోతే శివుడే తిన్నడి కోసం చూస్తున్నట్టుగా ఒకట్రెండు సన్నివేశాలున్నాయి. అక్షయ్ కుమార్, కాజల్ పాత్రలకు లిప్ సింక్ సరిగా లేదు. శివుడుగా అక్షయ్ ఓకే కానీ.. కాజల్ అస్సలు సూట్ కాలేదు. ప్ర
ప్రభాస్ ను ఈ పాత్రకు ఒప్పించినప్పుడే సగం సక్సెస్ అయ్యాడు విష్ణు. అతను లేకపోతే సినిమా ఈ రేంజ్ లో నిలబడేదైతే కాదు. తన ఇమేజ్ కు చాలా దూరంగా ఆ పాత్రకు చాలా దగ్గరగా నటించి సినిమాను నిలబెట్టే నటనతో ఆకట్టుకున్నాడు ప్రభాస్. మోహన్ బాబు తక్కువ సన్నివేశాలే అయినా ఆయన ఇమేజ్ కు సరిపోయే పాత్ర. బాగా చేశాడు. ఇతర పాత్రల్లో శరత్ కుమార్, ముఖేష్ రుషి ఆకట్టుకున్నారు. మధుబాల ప్రతిసారీ నటనతోనే చిరాకు పెట్టింది. అస్సలు సెట్ కాలేదా పాత్రకు. దేవరాజ్, రఘుబాబు, సప్తగిరి, బ్రహ్మానందం, సంపత్ రామ్, ఐశ్వర్య ఓకే.
టెక్నికల్ గా పాటలు ఇంకా బావున్నాయి. నేపథ్య సంగీతం హైలెట్. సినిమాటోగ్రఫీ విజువల్ ఫీస్ట్ లా ఉంది. డైలాగ్స్ బావున్నాయి. మూడు గంటలకు పైగా నిడివి ఉంది. సులువుగా 15 నిమిషాలకు పైనే ఎడిట్ చేయొచ్చు.. ఒక పాటతో కలిపి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. విఎఫ్ఎక్స్ ఓకే. దర్శకుడుగా ముఖేష్ కుమార్ సింగ్ పనితనం సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కనిపించింది. అదే సినిమాను నిలబెట్టే అవకాశాలూ ఉన్నాయి. నిర్మాతగా, హీరోగా సినిమాను తన భుజాలపై మోస్తూ.. అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేసిన విష్ణు కష్టం ఫలించేలానే ఉంది అని చెప్పొచ్చు.
ఫైనల్ గా : మాగ్జిమం కమర్షియల్ మినిమం డివోషనల్
రేటింగ్ : 3/5
- బాబురావు కామళ్ల