Adani Group : అదానీ గ్రూప్‌ .. ఒక్క రంగంలోనే భారీగా ఇన్వెస్ట్

Update: 2024-04-08 10:26 GMT

 వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పునరుత్పాదక ఇంధనాల కార్యకలాపాలపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030 నాటికి పునరుత్పాదక శక్తి విభాగం విస్త రణ, సౌర.. పవన విద్యుత్ పరికరాల తయారీకి సంబంధించి సామర్థ్యాల పెంపు మొదలైన వాటిపై రూ. 2.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) ఎం డీ వినీత్ ఎస్ జైన్ తెలిపారు. గుజరాత్ లోని ఖావాలో సౌర, పవన విద్యుదుత్పత్తి సామర్ధ్యాలను పెంచుకోవడంపై రూ. 1.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు.

దేశ వ్యాప్తంగా అదే తరహా ఇతర ప్రాజెక్టులపైనా రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జైన్ వివరించారు. గుజరాత్లోని ముంద్రాలో సోలార్ సెల్, విండ్ టర్బైన్ తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు అదానీ న్యూ ఇండస్ట్రీస్ (ఏఎన్ఐఎల్) దాదాపు రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 10.93 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక శక్తి సామర్థ్యాలను 2030 నాటికి 45 గిగావాట్లకు పెంచుకోవాలని ఏజీఈఎల్ నిర్దేశించుకుంది.

Tags:    

Similar News