కర్ణాటక రాజధాని బెంగళూరులో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బెంగళూరును వరద ముంచెత్తింది. గత 24 గంటల్లో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో 15 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వందలాది కాలనీలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు చెరువుల్లా మారిపోయాయి.
భారీగా వరద రావడంతో రవాణా స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరుకు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు. అటు కర్ణాటకలోని 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.