BJP MP Ticket : సందేశ్‌ఖాలీ బాధితురాలికి బీజేపీ ఎంపీ టికెట్

Update: 2024-03-26 07:28 GMT

పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) సందేశ్‌ఖాలీ గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘సందేశ్‌ఖాలీ’ వివాదంలో బాధిత మహిళ రేఖా పత్రాను బసిర్‌హట్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. ఈ పార్లమెంట్‌ పరిధిలో‌నే ఆ గ్రామం ఉంది. ఇటీవల అధికార టీఎంసీ పార్టీకి చెందిన షాజహాన్ షేక్ మహిళలపై అకృత్యాలకు పాల్పడటంతో పాటు భూముల లాక్కుంటున్నట్లు వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై బాధితురాలు రేఖా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై జాతీయ స్థాయిలో వెళ్లడంతో టీఎంసీ షాజహాన్ షేక్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందికి పైగా అరెస్టు అయ్యారు. బీజేపీ టికెట్ లభించిన అనంతరం రేఖ పాత్ర ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. తాను ఎల్లవేళలా గ్రామంలోని మహిళలకు అండగా ఉంటానని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాలకు గాను 38 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. డైమండ్ హార్బర్, అసన్సోల్, బిర్భమ్, జార్గ్రామ్‌లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.

Tags:    

Similar News