పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ల కలకలం
పాకిస్తాన్ నుంచి వచ్చిన మూడు డ్రోన్‌లను BSF బలగాలు కూల్చేశాయి;
పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌లు కలకలం రేపాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన మూడు డ్రోన్‌లను BSF బలగాలు కూల్చేశాయి. పంజాబ్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గుండా అవి వేర్వేరు ప్రాంతాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. ఈ డ్రోన్లు అమృత్‌సర్ జిల్లాలోని ఉధర్ ధరివాల్, రత్తన్‌ఖుర్ద్ గ్రామాల పరిధిలో గుర్తించి కూల్చివేసినట్లు BSF అధికారులు తెలిపారు. ఓ డ్రోన్ పాకిస్థాన్ భూ భాగంలో పడిపోయినట్లు వెల్లడించారు. ఒక డ్రోన్‌లో 2.6 కిలోల బరువున్న రెండు ప్యాకెట్లు కనిపించాయి. వాటిలోని పదార్థాన్ని హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు అధికారులు.