Punjab Politics : పంజాబ్ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్..

Punjab Politics : పంజాబ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది;

Update: 2022-09-16 11:00 GMT

Punjab Politics : పంజాబ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ''పంజాబ్ లోక్ కాంగ్రెస్'' పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఇందుకు సెప్టెంబర్ 19 ముహూర్తం కూడా పిక్స్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో ఆయన చేరనున్నారు.

గత ఏడాది సీఎం పదవి నుంచి తొలగించడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే సొంత పార్టీ పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో అమరీందర్ సహా పీఎల్‌సీ అభ్యర్థులంతా చిత్తుగా ఓడిపోయారు.

కెప్టెన్‌తో పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాణ్ సింగ్ కూడా బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అమరీందర్ ఇటీవల వెన్నెముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్నారు. ఒకప్పటి పాటియాలా రాజకుంటానికి చెందిన అమరీందర్ రెండు సార్లు పంజాబ్ సీఎంగా పని చేశారు. 

Tags:    

Similar News