Chirutha Head Struck in Metal Pot :లోహపు పాత్రలో ఇరుక్కున్న పులి తల

Update: 2024-03-04 11:23 GMT

Maharashtra : మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని ఓ గ్రామంలో తాగునీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే పాత్రలో చిరుతపులి (Chirutha) తల ఇరుక్కుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చిరుతపులి లోహపు కుండలో తల ఇరుక్కున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. మొత్తానికైతే ఐదు గంటల పాటు శ్రమించి చిరుతను అటవీ శాఖ అధికారులు రక్షించారు.

ఈ సంఘటన శనివారం (మార్చి 2) ధులేలోని సక్రి తాలూకా శివారా గ్రామంలో జరిగింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవ్వడంతో అటవీశాఖాధికారులకు ఫోన్ చేసి రక్షించారు. అటవీశాఖ అధికారులు పశువైద్యులతో అక్కడికి చేరుకున్నారు. వెటర్నరీ వైద్యులు చిరుతపులికి ట్రాంక్విలైజర్లు వేసి చిరుత మెడలో ఇరుక్కున్న పాత్రను జాగ్రత్తగా బయటకు తీశారు.

అటవీ శాఖ అధికారులు యంత్రంతో పాత్రను కోసి జంతువు తలపై నుంచి బయటకు తీశారు. అధికారులు చిరుతను బంధించి బోనులో ఉంచి తమ వెంట తీసుకెళ్లారు. కుండలో తల ఇరుక్కుపోయిన జంతువును చూసేందుకు అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

Tags:    

Similar News