Shiv Sena : నా చాప్టర్ క్లోజ్.. బీఎండబ్ల్యూ కారు ఢీ కేసులో శివసేన కొడుకు పశ్చాత్తాపం

Update: 2024-07-12 07:37 GMT

కారుతో ఢీకొట్టి ఓ మహిళ మృతికి కారణమైన ప్రధాన నిందితుడు తన తప్పును అంగీకరించాడు. నేను చేసిన తప్పుని అంగీకరిస్తున్నా.. నా కెరీర్ ఇంతటితో ముగిసిపోయింది అని మిహిర్ షా సిట్ విచారణలో అంగీకరించాడు. శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా ఇటీవల ముంబయిలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన సంగతి సంచలనం రేపింది.

ఈ కేసులో నిందితులైన మిహిర్, అతడి డ్రైవర్ రాజశ్రీ బిదావత్లను సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు మిహిర్ తాను చేసిన తప్పునకు చింతిస్తున్నట్లు పోలీసులు ముందు బాధపడ్డారు. ప్రమాద సమయంలో కారు కింద మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని నిందితులు వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కారు చక్రాల కింద మహిళ ఇరుక్కుపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడు మహిళను కారుతో లాక్కెళ్తున్న సమయంలో కొందరు వాహనదారులు కారు ఆపమని వారించినా వినిపించుకోలేదని పోలీసులు తెలిపారు.

1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తర్వాత మిహిర్, అతడి డ్రైవర్ సీట్లు మార్చుకున్నారు. ఇంజన్ బే వద్ద ఉన్న మహిళ మృతదేహాన్ని తొలగించి రోడ్డుపై పడేశారు. అలాగే పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో అతడు జుట్టు ట్రిమ్ చేసి, గడ్డం గీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటన తర్వాత అతడు ఆటోలో గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ కేసు మహారాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది.

Tags:    

Similar News