హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడిగా పోటీ చేయనున్నాయి! గత ఎన్నికల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ 28 శాతం ఓట్లతో 31 సీట్లు గెలిచింది. అయితే, అప్ కేవలం 0.48 శాతం ఓట్లతో ఒక్క సీటుకూడా గెలవలేదు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేయగా కాంగ్రెస్ 5 గెలవగా, ఆప్ ఒక్కటీ గెలవలేదు. దీంతో ఆప్‌తో పొత్తు వల్ల పెద్ద ఉపయోగం లేదనేది AICC వర్గాల అభిప్రాయం.
జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.