ఎంత చెప్పినా ఇంతేనా.. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ..
అయినా ఆమాత్రం ఆలోచన ఉండదా.. బుద్ధిగా డ్రైవింగ్ చేస్తుంటేనే ఎవరు ఎట్నుంచి వచ్చి గుద్దేస్తారో అని ఇంటికి వెళ్లేదాకా గ్యారెంటీ లేని రోజులివి.;
అయినా ఆమాత్రం ఆలోచన ఉండదా.. బుద్ధిగా డ్రైవింగ్ చేస్తుంటేనే ఎవరు ఎట్నుంచి వచ్చి గుద్దేస్తారో అని ఇంటికి వెళ్లేదాకా గ్యారెంటీ లేని రోజులివి. అలాంటిది డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఏదైనా జరగరానిది జరిగితే తరువాత అనుకుని ప్రయోజనం ఏం ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానం ఉండట్లేదు ఎవరికీ. పోలీసులు ఎంత మొత్తుకున్నా మా ఇష్టం మాది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. మగ పురుషులకు ఏ మాత్రం తీసిపోని మహిళా మణులు సైతం ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వెనుకా ముందు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని ట్రాఫిక్ లో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు అమ్మలు సైతం.
ఫోన్ మాట్లాడుతూ ఓ మహిళ స్కూటీ నడుపుతున్న వీడియోను ఢిల్లీ పోలీసులు షేర్ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అవసరమైన నియమాలను పాటించాలని ప్రజలను పదేపదే హెచ్చరించినా ఫలితం లేక తలలు పట్టుకుంటున్న పోలీసులు కెమెరా కంటికి చిక్కిన ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కనీసం ఇవి చూసైనా మారండి మహాప్రభో అని హెచ్చరిస్తున్నారు. చలాన్ మొత్తాన్ని పెంచినా కట్టి మరీ మళ్లీ అలానే ప్రవర్తిస్తున్నారు. భారీ జరిమానా భయంతో ప్రజల్లో కొంచెమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే, ఈ చట్టాలను, చుట్టాలను పట్టించుకునే టైమ్ మాకు లేదని పరిగెడుతున్నారు. ఢిల్లీ పోలీసులు పంచుకున్న ఈ వీడియోలో ఒక మహిళ స్కూటర్ నడుపుతూ మొబైల్‌లో మాట్లాడుతోంది.
వీడియో ప్రారంభంలో, ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ స్కూటర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తుంది, అయితే ఆ సమయంలో ఆమె స్కూటర్‌పై నియంత్రణ కోల్పోతుంది.
ఓ చేత్తో యాక్సిలేటర్, మరో చేత్తో మొబైల్ ఫోన్ పట్టుకున్న మహిళ.. స్కూటర్ అదుపు తప్పి తనను తాను కంట్రోల్ చేసుకునే సరికి కారు వేగంగా లారీ వైపు దూసుకెళ్లింది. ఢీకొనడానికి ముందు స్కూటర్ ఆగిపోయినా, మహిళకు స్కూటర్‌పై నియంత్రణ లేదు. మరోసారి స్కూటర్ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓ బలమైన సందేశం ఉంది.
మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ ఢిల్లీ పోలీసులు వీడియోను షేర్ చేయడం ద్వారా ప్రజలను హెచ్చరించారు. పోలీసులు ఇలా అన్నారు, 'ఫోన్ మీ దృష్టిని మరల్చుతుంది, మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తే ఒక సమయంలో ఒక పనే చేయండి.' ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు X లో పంచుకున్నారు, దీనిపై ప్రజలు తమ స్పందనలు తెలిపారు.
మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, పెను ప్రమాదాలు ఇలాగే జరుగుతాయని రాశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడవద్దని, కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దని తెలిపారు.
फोन भटकाता है आपका ध्यान
— Delhi Police (@DelhiPolice) January 4, 2024
एक बार में किया करो एक काम
अगर प्यारी है अपनी जान@dtptraffic #RoadSafety pic.twitter.com/13D9QMkXfQ