Elections : మహారాష్ట్ర, జార్ఖండ్ లో మోగిన ఎన్నికల నగారా..

మహారాష్ట్రలో నవంబర్ 20 , జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికలు నవంబర్ 13వ , రెండో విడత నవంబర్ 20;

Update: 2024-10-15 10:30 GMT

 మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువరించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ - అక్టోబర్ 22

నామినేషన్ల దాఖలకు చివరి తేదీ - అక్టోబర్ 29

నామినేషన్ల స్క్రూటినీ - అక్టోబర్ 30

నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ - నవంబర్ 4

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ - నవంబర్ 20

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ - నవంబర్ 23

మహారాష్ట్రలో 36 జిల్లాలు, 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీ వరకు ఉంది. మొత్తం నియోజకవర్గాల్లో 234 జనరల్‌ సీట్లు కాగా.. 25 ఎస్టీ, 29 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు నమోదు చేసుకోగా.. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక 20-29 ఏళ్ల లోపు యువ ఓటర్లు 1.85 కోట్ల మంది ఉండగా.. తొలిసారి 20.93 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల కోసం 100186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

తొలి విడత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

నోటిఫికేషన్ - అక్టోబర్ 18

నామినేషన్ల దాఖలకు చివరి తేదీ - అక్టోబర్ 25

నామినేషన్ల స్క్రూటినీ - అక్టోబర్ 28

నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ - అక్టోబర్ 30

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ - నవంబర్ 13

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ - నవంబర్ 23

రెండో విడత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

నోటిఫికేషన్ - అక్టోబర్ 22

నామినేషన్ల దాఖలకు చివరి తేదీ - అక్టోబర్ 29

నామినేషన్ల స్క్రూటినీ - అక్టోబర్ 30

నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ - నవంబర్ 1

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ - నవంబర్ 20

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ - నవంబర్ 23

జార్ఖండ్‌లో 24 జిల్లాలు ఉండగా.. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ 81 నియోజకవర్గాల్లో జనరల్‌ 44 సీట్లు కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున కేటాయించారు. మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు.. 1.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక 66.84 లక్షల మంది యువ ఓటర్లు ఉండగా.. తొలిసారి 11.84 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఉంది.

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశంలో ఖాళీగా ఉన్న 2 లోక్‌సభ, 48 శాసనసభ ఎన్నికలకు కూడా ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రాహుల్ గాంధీ గెలిచిన తర్వాత రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్‌తోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గాలు ఉన్నాయి.

Tags:    

Similar News